కథలాపూర్
రాజీనామా లేఖతో డ్రామాలాడుతున్న హరీష్ రావు

viswatelangana.com
April 26th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
- ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కథలాపూర్ మండలం సిరికొండ లో మాట్లాడుతూ హరీష్ రావు తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఫార్మాట్ లో సిద్ధం చేసుకోకుండా గన్ పార్క్ వద్ద నాటకానికి తెర తీస్తూ ఆగస్ట్ 15 లోపు రుణ మాఫీ చేయకుంటే సీఎం రేవంత్ రెడ్డిని రాజీనామా చెయ్యుమంటూ లేఖలతో సరిపెట్టుకోకుండా మాట మీద నిలబడాలని 100% మా సీఎం మాటంటే మాటేనని రుణ మాఫీ ఆగస్ట్ 15 లోపు చేసి తీరుతామని హరీష్ రావు సవాల్ కు సిద్ధంగా ఉండాలని అన్నారు.



