రాయికల్

జీవన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి లక్ష్మణ్

viswatelangana.com

April 29th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ అయోధ్య గ్రామాలలో ఉపాధి హామీ కూలీలను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను కోరిన జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను 100% నెరవేర్చగల పార్టీ కాంగ్రెస్ పార్టీని ఉపాధి హామీ కూలీలకు 400 రూపాయల కూలీ పెంచి ఎండాకాలంలో అదనంగా 50 రూపాయలు ఇచ్చేందుకు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని అన్నారు ఇప్పటి వరకే ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రభుత్వము ఏర్పడిన మూడు నెలల్లోనే ఐదు గ్యారంటీలను అమలుపరిచి మహిళా సంక్షేమంకే పెద్ద పీట వేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు అలాగే రానున్న రోజుల్లో ఇండ్లు లేని నిరుపేదలందరికీ ప్రత్యేకంగా ఇందిరమ్మ గృహ నిర్మాణం అలాగే ఐదు లక్షల రుణ సదుపాయం కల్పించడంలో జీవన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని ప్రతి నిరుపేద కుటుంబానికి గూడు ఉండే విధంగా చేస్తారని దానికి మాది గ్యారెంటీ అని అన్నారు బీడీ కార్మికుల కొరకు ప్రత్యేకంగా జగిత్యాలలో పిఎఫ్ ఆఫీస్ అలాగే ఆసుపత్రిని నిర్మిస్తానని జగిత్యాల జిల్లా కేంద్రంలో పాస్ పోర్ట్ ఆఫీస్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపుతానని అన్నారని దీనిని దృష్టిలో ఉంచుకొని రాబోవు రోజుల్లో కచ్చితంగా హామీలను నెరవేర్చే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చేతి గుర్తుపై ఓటు వేసి జీవన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో మీరు గెలిపిస్తారని ఆశిస్తున్నామన్నారు.

Related Articles

Back to top button