రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
viswatelangana.com
రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాయికల్ మున్సిపల్ చైర్మన్ లయన్ మోర హనుమండ్లు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులను, త్యాగమూర్తులను స్మరిస్తూ.. సెల్యూట్ చేసే రోజు ఇది అమర వీరుల త్యాగాలను గుర్తుతెచ్చుకుంటూ. మన గుండెల్లో నిండిన దేశభక్తిని చాటుతూ. సగర్వంగా మన భరతమాతకు వందనాలు తెలుపుకుంటు స్మరిద్దాం గౌరవిద్దాం సగర్వంగా జరుపుకుందాం గణతంత్ర దినోత్సవమని లయన్స్ సభ్యలకు, పట్టణ ప్రజల అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిసీ బత్తిని భూమయ్య, అధ్యక్షుడు కొమ్ముల ఆది రెడ్డి, ప్రధాన కార్యదర్శి మోసారపు శ్రీకాంత్, కోశాధికారి గంట్యాల ప్రవీణ్ , లయన్స్ సభ్యులు కడకుంట్ల నరేష్, బొమ్మ కంటి నవీన్, కనపర్తి శ్రీనివాస్, దాసరి గంగాధర్, ఎద్దండి దివాకర్, ఏలిగేటి అనిల్, కట్ల నర్సయ్య, వాసము స్వామి, వాసం ప్రసాద్, పారిపెల్లి శ్రీనివాస్, కట్కాము కళ్యాణ్, నిమ్మల వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.



