గెలిపిస్తే ప్రశ్నించే గొంతునవుతాబిఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్

viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని ఎస్సారార్ ఫంక్షన్ హాల్లో వినోద్ కుమార్ మాట్లాడుతూ బిజెపి ఎంపీ బండి సంజయ్ ఐదేళ్ళలో ఏమి చేయలేదని, బిజెపి దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తుందని,అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే 500కు సిలిండర్, 2 లక్షల రుణ మాఫీ, పెన్షన్ ల పెంపు లాంటి ఆరు గ్యారంటీల పేరుతో ప్రజల్ని మోసం చేసిందని అన్నారు. కేసీఆర్ పాలనలో పచ్చని పంట పొలాలు,కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎండిన పొలాలు, నెర్రెలు బారిన ప్రాజెక్టు లు దర్శనమిస్తున్నాయని కావున కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఇంచార్జి లక్ష్మీ నరసింహారావు, తుల ఉమ, గూడూరి ప్రవీణ్, లోక బాపురెడ్డి, జెడ్పిటీసి భూమయ్య, ఎంపిపి రేవతి, వైస్ ఎంపిపి కిరణ్ రావు,జవిడి ప్రతాప్ రెడ్డి, కల్లెడ శంకర్, వంగ రవీంధర్, కేసరి సాయన్న, మైస శ్రీధర్, దొప్పల జలంధర్, ఎండీ ముజేబ్ తదితరులు పాల్గొన్నారు.



