పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

viswatelangana.com
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని పి.ఎన్.ఆర్ గార్డెన్ లో కట్లకుంట గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల పూర్వ విద్యార్థులు 2006-2007 సంవత్సరం గల10 తరగతి విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరందరూ చాలా రోజులకు కలుసుకున్నందుకు ఒకటి నొకరు పలకరించుకొని యోగ క్షేమాలు తెలుసుకొని ఎంతో సంబర పడ్డారు. ఇలా కలుసు కోవడం చాలా సంతోషంగా ఉందని, ఎన్నో జ్ఞాపకాలు ఎన్నెన్నో సరదాలు అలనాటి చేసిన చిలిపి పనులు, కలబడిన కలహాలు, వాదనలు, అలనాటి మధురమైన స్నేహ బంధం గురించి నెమరు వేసుకుని సంతోషంతో తబ్బిప్పయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ అలనాడు విద్యార్థులు చేసిన చిలిపి పనులు, చదువుపై ఆసక్తి కనపరచిన విద్యార్థులు, విద్యార్ధులను దండించిన జ్ఞాపకాలను విద్యార్థులతో నెమరు వేసుకుని విద్యార్థులతో చాలా సేపు ముచ్చటగా గడిపారు. విందు ఏర్పాటు చేసుకుని, డీ జే చప్పుల్లతో డ్యాన్స్ లు వేస్తూ ఆనందంగా గడిపారు.



