Uncategorized

ఎంపీ గా వెలిచాల రాజేంధర్ రావును గెలిపించండి

viswatelangana.com

May 7th, 2024
Uncategorized (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని పలు గ్రామాలైన తాండ్రియాల, దుంపేట, భూషణరావుపేట, చింతకుంట గ్రామాల్లో ఈనెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు ప్రభుత్వ విప్ వేములవాడ నియోజకవర్గం శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కథలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు చెదలు సత్యనారాయణ ఆది శ్రీనివాస్ కు కిరీటం తొడిగి రైతు నాగలి బహుకరించి సన్మానించారు అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తుందన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలను అమలుపరుస్తూ ప్రజలకు మరింత చేరువైందన్నారు. బిఆర్ఎస్ బిజెపి తప్పుడు మాటలు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు ప్రజలు తెలివైన వారిని ఇక నమ్మే పరిస్థితిలో లేరన్నారు బిజెపి నేతలు రాముని పేరు చెప్పి ఓట్లు అడగడం సిగ్గుచేటని దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి అన్నారు శ్రీరాముని అక్షింతలు అంటూ ఇంటింటికి పంపిణీ చేసి ప్రజలను బిజెపి పక్కదో పట్టించారన్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికలు ముగిశాక అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ఇల్లు అందేలా కృషి చేస్తామన్నారు. కులం మతం పేరుతో బిజెపి ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తుందని ప్రజలు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో కథలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాయితి నాగరాజు, కథలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు చెదలు సత్యనారాయణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు తొట్ల అంజయ్య, పులి హరిప్రసాద్, ఎండీ అజీమ్, కల్లెడ గంగాధర్, వెగ్యారపు శ్రీహరి, ఉప సర్పంచ్ లోక నర్సారెడ్డి, గజా ప్రభాకర్ వంగ మహేష్, వేముల కృష్ణ, జక్కుల రాజారాం, కుంట రెడ్డి రెబ్బాస్, శంకర్, వాకిటి రాజారెడ్డి, గడ్డం స్వామి రెడ్డి, గడ్డం చిన్నరెడ్డి, గడ్డం రాజేశ్వర్ రెడ్డి, పుర్కుటపు తిరుపతి రెడ్డి, గోపిడి మారుతి రెడ్డి, గోపిడి మధుసూదన్ రెడ్డి, కూన శ్రీనివాస్, కూన అశోక్, తలారి మోహన్,సుంకే పవన్, గడీల గంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Back to top button