
viswatelangana.com
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు ఆదేశాల మేరకు నిజామాబాదు పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ స్థానిక మల్లాపూర్ లో కాంగ్రెస్ సేవాదళ్ సభ్యులు మంగళవారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరుస్తున్న ఆరు గ్యారంటీ లపై ప్రజలకు ఇంటింటికి ప్రచారం చేస్తూ అవగాహన కల్పించారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు 2500 ఇస్తామని ఇప్పటివరకు 200 యూనిట్లకు ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ప్రతి మహిళకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని రానున్న రోజుల్లో మరెన్నో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్నో పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభిస్తుందని అన్నారు. జీవన్ రెడ్డికి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ గద్దె నరహరి, మల్లాపూర్ టౌన్ సేవాదళ్ ప్రెసిడెంట్ ఉప్పులుటి నగేష్, సురేష్, వనతడుపుల వెంకటేష్, మల్లాపూర్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు



