ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

viswatelangana.com
ఎండల తీవ్రత దృష్ట్యా రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామ శివారులోని నల్లగుట్ట వద్ద పని చేస్తున్న ఉపాధి హామీ కూలీలకు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి కి మద్దతుగా వీరాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ జైనోద్దీన్ సుమారు 300 మందికి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందడానికి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కు పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దిండిగాల రామస్వామి గౌడ్, సోమ వెంకటేష్, దుంపల స్వామిరెడ్డి, సుందరగిరి గంగాధర్, దుంపల నర్సారెడ్డి, మహమ్మద్ మల్లిక్ అహ్మద్, షేక్ ఇస్మాయిల్, మాద నారాయణ,నీలి మహేందర్,చెదలు శంకర్, సోమ వెంకటస్వామి,నీలి ఆనందం, షేక్ మున్నా, మజీద్, కనికరపు శ్రీనివాస్, బైరి నర్సయ్య, బైరి రాజారాం, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.



