కథలాపూర్

ప్రచారం లో దూకుడు పెంచిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు

viswatelangana.com

May 11th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలపూర్ మండలం దుంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాయితీ నాగరాజు దూకుడు పెంచాడు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రావడంతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాయితీ నాగరాజు కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతూ కథలాపూర్ లో ప్రతిపక్ష పార్టీ నాయకుల ఊహలకు అందని రీతిలో ప్రచారం చేస్తూ వేములవాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుని చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటు అభ్యర్థించారు. ఇందిరమ్మ మనుమడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అంటే వెలిచాల రాజేందర్ రావు గెలవాలి కాబట్టి ప్రతి ఒక్కరు చేయి గుర్తు పై ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యుఐ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుల సంతోష్, నాయకులు తీగల మధు, తీగల రాజారెడ్డి, కోడిపెళ్లి రంజిత్, తోట శరత్, నక్క రాజేశం, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button