Local
బాంబును కొరికిన ఎద్దుకు తీవ్ర గాయాలు

viswatelangana.com
May 16th, 2024
Local (విశ్వతెలంగాణ) :
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం మొగాడ్ ధగడ్ గ్రామానికి చెందిన జీత్రు అనే రైతు కు సంబంధించిన ఎద్దు అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లి గాయాలపాలయ్యిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం రైతు తెలిపిన వివరాల ప్రకారం అడవి పందులను వేటాడడానికి వేసిన నాటు బాంబును ఎద్దు కొరకడంతో ఎద్దు తల దవడ చెల్లాచెదురైందని అన్నారు. ఇంటికి వచ్చిన ఎద్దును చూసిన రైతు ఎలుములే జిత్రు కన్నీరు మున్నీరుగా విలపించాడు.



