కోరుట్ల
ఘనంగా కోరుట్ల లో వాసవీ మాత జయంతి

viswatelangana.com
May 18th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో వాసవీ మాత జయంతి సందర్భంగా శనివారం రోజున వాసవి మాత దేవాలయంలో అమ్మవారికి వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ ఆధ్వర్యంలో పూలు పండ్లు ఒడి బియ్యము సమర్పించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగినది. ఈ కార్యక్రమములో ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ఎలిమి మనోజ్, వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ అధ్యక్షులు నీలి శ్రీనివాస్, కార్యదర్శి కొత్త విద్యాసాగర్, కోశాధికారి ఎస్ వెంకటేశ్వర్లు, డిస్టిక్ ఇంచార్జ్ నీలి లక్ష్మీ, వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్ సభ్యులు పాల్గొన్నారు.



