కొడిమ్యాల
బొలెరో వాహనం లారీ ఢీ -వ్యాన్ డ్రైవర్ మృతి

viswatelangana.com
May 19th, 2024
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ బ్రిడ్జిపై ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి జగిత్యాలకు పాలప్యాకెట్ల లోడుతో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పాల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం కు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బొలెరోని మరొకరికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స కోసం సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. రోడ్డుపై వాహనాలు అడ్డుగా ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాలను తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేసారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది



