అర్నకొండ గ్రామ పంచాయితీ రికార్డ్స్ లను తనిఖీలు చేసిన కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్

viswatelangana.com
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం అర్నకొండ గ్రామపంచాయతీ యొక్క రికార్డ్స్ మొత్తము కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ ( పౌర మరియు మానవ హక్కుల సంస్థ ) ఆధ్వర్యంలో ఆర్టిఐ ఆర్ట్ 2005 చట్టం ప్రకారము తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలు ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగాయి. స్టేట్ సెక్రటరీ చరణ్ కాంత్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ యొక్క రికార్డ్స్ సరిగా లేవని కరెక్ట్ గా మైంటైన్ చేయలేదని అలాగే బిల్లుల విషయంలో చాలా అవకతవకలు జరిగాయాని అయన తెలిపారు. అలాగే రికార్డులు తనిఖీ చేసే సమయంలో దొరికినటువంటి అవకతవకలు తప్పులు అన్నిటిని, ఒక ఫైనల్ రిపోర్టు తయారు చేసి కలెక్టర్ కి లేదా పై అధికారులకు సబ్మిట్ చేయడం జరుగుతుందని వివరించారు అలాగే సమాజంలో జరుగుతున్న అవినీతిని బయట పెడుతూ అలసత్వం లేని సమాజం నిర్మించడమే సిసిఆర్ లక్ష్యమనిఅవినీతి అంతం సీసీఆర్ పంతం అని ఆయన పేర్కొన్నారు. అలాగే సమాచార హక్కు చట్టం పై అవగాహన పెంచుకోవాలని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ చరణ్ కాంత్, గుండ్ల శివచంద్రం, నేవూరి రత్నాకర్, మరియు భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.



