viswatelangana.com
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , బీసీ సంక్షేమ & రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు సీతక్క, ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గార్లతో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గ సమస్యలపై ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ప్రభుత్వం సాగునీటి పై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు.. కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండల ప్రజల తాగు, సాగునీటికి ఎంతో ఉపయోగపడే కలికోట సూరమ్మ చెరువు కుడి,ఎడమ కాలువల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని, వేములవాడ రూరల్ మర్రిపెళ్లి గ్రామంలోని మర్రిపల్లి చెరువు, కోనరావుపేట మండలంలోని లచ్చంపేట చెరువులను రిజర్వాయర్ లుగా మార్చడానికి నిధులు విడుదల చేయాలని కోరారు.



