కథలాపూర్
విదేశీ పర్యటన ను ముగించుకుని మాతృదేశానికి విచ్చేసిన ప్రభుత్వ విప్ కు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ మండల నాయకులు

viswatelangana.com
May 25th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
గల్ఫ్ కార్మికుల సమస్యలు తెలుసుకోవడానికి నేనున్నానంటూ భరోసా ని ఇస్తూ విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి తిరిగి వస్తున్న వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కథలాపూర్ మండల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు కాయితీ నాగరాజు, తొట్ల అంజయ్య, వెలిచాల సత్యనారాయణ మార్గం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



