రాయికల్
నీట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థి

viswatelangana.com
June 5th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
మంగళవారం ప్రకటించిన నీట్ పరీక్ష ఫలితాల్లో రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామానికి చెందిన చెదలి హరీష్ బాబు అనే విద్యార్థి ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. నీట్ పరీక్షలో 720 మార్కులకు గాను 523 మార్కులు సాధించి ఆలిండియా స్థాయిలో 176284 వ ర్యాంక్,ఓబీసీ కేటగిరీలో 83637 వ ర్యాంక్ సాధించాడు. నీట్ ( నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ )లో ఉత్తమ ర్యాంక్ సాధించడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనను గ్రామస్తులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.



