విద్యార్థులకు తప్పని బస్సు తిప్పలు

viswatelangana.com
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేసిన మొదటి హామీ మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఈ ఫ్రీ బస్సు కారణంగా ఎంత మందికి ఉపయోగం కలుగుతుందో తెలీదు కానీ చాలామందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని విద్యార్థుల తిప్పలు వర్ణనాతీతం. చదువుల కోసం విద్యార్థులు నానా తిప్పలు పడుతున్నా బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రమాదం అని తెలిసి విద్యార్థులకు ఫుట్ బోర్డు ప్రయాణం తప్పడం లేదు. విద్యార్థుల గోసలు చూస్తుంటే తల్లిదండ్రులు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. చింతకుంట, భూషణరావుపేట, ఊట్ పల్లి, పెగ్గెర్ల నుండి కథలాపూర్ మీదుగా కోరుట్ల కు, గంభీర్ పూర్ తాండ్రియల పోసానిపేట దుంపేట గ్రామాల నుండి కథలాపూర్ మీదుగా కోరుట్లకు, తుర్తి, అంబారిపేట, ఇప్పపెల్లి, పోతారం నుండి కోరుట్ల కు వెళ్లే విద్యార్థుల సంఖ్య దాదాపు 500 మందికి పైగా ఉంది.విద్యార్థులు చదువు కొరకు కథలాపూర్ మరియు కోరుట్ల కి వెళ్తుంటారు అదే సమయంలో ఇతర గ్రామాలకు వెళ్లే వాళ్లు కూడా అదే బస్సులో ప్రయాణించడంతో దీంతో విద్యార్థుల తిప్పలు అధికమవుతున్నాయి. కొన్ని సమయంలో బస్సు వదిలిపెట్టి వేరే బస్సు కోసం వేచి చూడటంతో స్కూల్ మరియు కాలేజీలకు కు చేరాల్సిన టైం కన్నా ఎక్కువ కావడంతో క్లాసులు మిస్ అవుతున్నట్టు చెప్తున్న విద్యార్థులు. గంభీర్ పూర్ నుండి ఒకే ఒక బస్సు నడవడంతో స్కూల్ పిల్లలతో పాటు ప్రయాణికులు ఇతర చోట పని చేసేవారు అందరూ అదే సమయానికి పోవడంతో విద్యార్థులకు ప్రయాణికులకు ఫుట్ బోర్డు పై ప్రయాణించే దుస్థితి పట్టింది. విద్యార్థులు మాట్లాడుతూ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలని గంభీర్ పూర్ నుండి కథలాపూర్ మీదుగా కోరుట్లకు, మరియు చింతకుంట నుండి కథలాపూర్ మీదుగా కోరుట్లకు, అంబారిపేట నుండి కథలాపూర్ మీదుగా కోరుట్ల కు మూడు బస్సులు మరియు కోరుట్ల వెళ్లేందుకు స్కూల్, కాలేజీలకు టైం కి బస్సులు కేటాయిస్తే తమ తిప్పలు కొంతవరకు తగ్గుతాయని అధికారులని కోరుతున్నారు.



