కోరుట్ల
కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి మచ్చ కవితకు చిరు సన్మానం

viswatelangana.com
June 17th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు శ్రీమతి మచ్చ కవిత మహిళల పట్ల శ్రద్ధ వహించి మహిళలకు ఏ సమస్య వచ్చిన ముందుండి వారి సమస్యల పరిష్కారాలకు కృషి చేస్తున్నందుకు పట్టణ కిస్మత్ బీడీ అధినేత కూతురు కాంగ్రెస్ నాయకురాలు చింత రూపాలత – అశోక్ తమ ఇంట్లో మర్యాదపూర్వకంగా మచ్చ కవితను కలిసి చిరు సన్మానం చేశారు.అనంతరం చింత రూపాలత మాట్లాడుతూ పట్టణంలో ఎంతోమంది మహిళలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, అలాంటి మహిళల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఆమె కోరారు. ముందు ముందు పట్టణంలో మహిళలకు ఎలాంటి ఆపద వచ్చినా తాను ఉన్నానని ముందుకు వచ్చి వారి ఆపదలో పాలుపంచుకోవాలని శ్రీమతి మచ్చ కవితను ఆమె కోరారు.



