కోరుట్ల
కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కృషితో కోరుట్ల నియోజకవర్గ డయాలసిస్ రోగులకు శుభవార్త

viswatelangana.com
June 20th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
గత కేసీఆర్ ప్రభుత్వంలో కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో అప్పటి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కృషితో ఏర్పాటైన డయాలసిస్ సెంటర్ లో. మరో 3 రోజుల్లో మరో 5 బెడ్ లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడు 5 బెడ్లతో రోజుకి దాదాపు 49 మందికి డయాలసిస్ సేవలు అందిస్తున్నారు వైద్యులు. ఇటీవల జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రులతో కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ కోరుట్ల డయాలసిస్ సెంటర్ కు మరో 5 బెడ్లు కావాలని కోరగా వైద్య ఆరోగ్య శాఖ నూతనంగా మరో 5 బెడ్లు మంజూరు చేయడం జరిగింది.



