మేడిపల్లి
చాకచక్యంగా పేకాట స్థావరంపై పోలీసుల దాడి

viswatelangana.com
June 22nd, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
జగిత్యాల ఎస్పీ సూచనల మేరకు, జగిత్యాల సిసిఎస్ సీఐ లక్ష్మీనారాయణ టీం, మేడిపల్లి పోలీసులు కలిసి శనివారం రోజున భీమారం మండల అవుట్స్కట్స్ లో పేకాట ఆడుతున్న స్థావరంపై మెరుపు దాడి చేసి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి నుండి నాలుగు లక్షల 50 వేలు, ఒక బైకు, ఒక కారు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని మేడిపల్లి మండల సబ్ ఇన్స్పెక్టర్ శ్యామ్ రాజ్ తెలపడం జరిగింది.



