మేడిపల్లి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం

viswatelangana.com
మేడిపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు,బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి వర్యులు, ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గార్ల చిత్ర పటాలకు పాలాభిషేకం జరిపించారు. యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన నిన్నటి కేబినెట్ మీటింగ్ లో తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం జులై మాసంలో 12 డిసెంబర్ 2018 నుండి 09 డిసెంబర్ 2023 వరకు తీసుకున్న ఋణలను మాఫీ చేయడానికి అంత సంధిగ్ధం చేశారు అని శనివారం రోజు వేములవాడ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు ఏనుగు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ అని 2008లో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులను రాజును చేయడానికి ఉచిత కరెంట్, ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేసి రైతుపక్షపాతి అనిపించుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు ఋణమాఫకి సిద్ధం అయి రైతుల కళ్ళల్లో ఆనందం తెస్తున్నారు. ఈ పదేండ్లలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం రైతులను రైతుబంద్ పేరుతో నిండాముంచింది బి ఆర్ఎస్ కెసిఆర్ ప్రభుత్వం పాలనలో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్నారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనాలో మంచిరోజులు వచ్చాయి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంత్రి వర్గానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం జెలెందేర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీపతి దామోదర్, మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సాయిని గంగారెడ్డి, ఉపాధ్యక్షులు మార్గం నర్సారెడ్డి, అధికార ప్రతినిధి చేపూరి నాగరాజు, బీసీ సెల్ అధ్యక్షులు మాధం వినోద్, ఎస్సీ సెల్ అధ్యక్షులు లాజర్ భాయ్, మైనార్టీ సేల్ అధ్యక్షులు ఎండీ అన్వర్ భాయ్, సీనియర్ నాయకులు మార్గం గంగరాజం, ఊరుమడ్ల నర్సయ్య, దాసరి శంకర్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, బద్దం రాజేందర్ రెడ్డి, మార్గం నవీన్, ముస్కెం శంకర్, జిల్లా రమేష్, తదితరులు పాల్గొన్నారు.



