రాయికల్

శ్రీ పావని హాస్పిటల్ ఆద్వర్యంలో ఉచిత మెగా వైద్య శిభిరం

viswatelangana.com

June 23rd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపెల్లి గ్రామంలో ఆదివారం జగిత్యాల పట్టణంలోని జంబిగద్దే చౌరస్తాలో గల శ్రీ పావని మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డా.శ్రీకాంత్ రెడ్డి, డా.పావని రెడ్డి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. హాస్పిటల్ వైద్యులు దాదాపు 200 మంది రోగులకు ఉచిత బిపి, షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. గ్రామ తాజ మాజీ సర్పంచ్ పాదం రాజు మాట్లాడుతూ, వాన కాలంలో వ్యాపించే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏమైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కోల శ్రీనివాస్, మాజీ ఉపసర్పంచ్ అంజనేయులు, నరేంధర్, రాజేంధర్, రవింధర్, మల్లారెడ్డి, ప్రభాకర్, జలేంధర్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button