కోరుట్ల

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

viswatelangana.com

June 23rd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

వారంతా చిన్ననాటి స్నేహితులు. ఒకే చోట చదువుకున్నారు. పదో తరగతి పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాలలో స్థిరపడగా, మరి కొంతమంది వ్యాపారం ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర ఉన్నత పాఠశాల 1990-91 లోని పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం కరీంనగర్ లోని ఆహా రెస్టారెంట్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒకచోట చేరి, ఆత్మీయ పలకరింపు, నడమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు. 33 సంవత్సరాలు తర్వాత కలుసుకున్న వారంతా ఒకరికోకరు పలకరించుకొని వారి జీవన స్థితిగతులు పంచుకుని రోజంతా ఆనందంగా గడిపారు. చాలా రోజుల తర్వాత కలుసుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం కరోన,ఇతర కారణాలతో మృతి చెందిన తోటి స్నేహితులను గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారికి నివాళులర్పించారు. ఇక నుంచి టచ్ లో ఉండాలంటూ ఫోన్ నెంబర్లు తీసుకోవడం తోపాటు ఈ మధుర జ్ఞాపకాలు తమ తమ సెల్ ఫోన్లో బంధించుకున్నారు. ఆనంతరం అందరూ స్నేహితులు 33 సంవత్సరాలు గడిచిన సందర్భంగా తోటి స్నేహితులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఆబీద్ రషీద్, సాన వినోద్, నరేష్, శరత్, రాజశేఖర్, రామ్మోహన్, మల్లేశం, హరీష్, వసీ, కాశీనాథం, నాదీమ్, గాజుల మహేష్, వేణుగోపాల్, సత్యం, సాజీద్, గంప శ్రీనివాస్, గంగాధర్, గోపాల్, వెంకన్న, సత్యనారాయణ, శ్రీధర్, శ్రీనాథ్, సంతోష్, కళాధర్, సట్ల శ్రీనివాస్, గోలి శ్రీనివాస్, వేణుగోపాల్, శ్రీధర్, నరహరి, మోసిన్, రాజ రఘునందన చారి, సతీష్, కళాధర్, బద్రి నరేష్, హరీష్, సతీష్, రంగారావు, మల్లేశం, కాశీనాథ్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button