రాయికల్

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

viswatelangana.com

June 30th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

రాయికల్ పట్టణ కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1993-94 లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రాయికల్ పట్టణ కేంద్రంలోని ఆర్.ఆర్ కన్వెన్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం రోజు ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు నాగభుషణం, ఆనందరావు, బుచ్చిరెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రీనివాసాచారి, విద్యాసాగర్, జనార్దన్, రాఘవులు, రాజేంద్ర ప్రసాద్, వెంకటేశ్వర్ రావులను వేదికపైకి ఆహ్వానించి, పాదాభివందనం చేసి పూలమాలతో, శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం తమతో పాటు చదువుకొని మృతి చెందిన తమ మిత్రులకు ఘనంగా నివాళి అర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని, ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అందరూ పాల్గొన్నారు

Related Articles

Back to top button