రాయికల్
ఈదుల లక్ష్మణ్ కు జ్ఞాన బుద్ద పూర్ణిమా జాతీయ అవార్డు

viswatelangana.com
June 30th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం వడ్డే లింగాపూర్ గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు ఈదుల లక్ష్మణ్ కుమార్ మానవ సేవే మాధవసేవ అనే మార్గంలో నడుస్తూ అనేక ప్రైవేటు వైద్యుల సహకారం మారుమూల ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి నీరుపేదల ఆరోగ్య అభివృద్ధికి తోడ్పారు కరోనా సమయంలో భయపడకుండా మారుమూల గ్రామాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందించారు తగిన సలహాలు ఇస్తు గ్రామీణ ప్రాంతాలలో విశిష్టమైన సేవలను పేద ప్రజలకు అందించినందుకు గాను గుర్తించి కరీంనగర్ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి జయంతి ఉత్సవాలు 2024 సందర్భంగా జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తెలుగు వెలుగు సాహితి వేదిక వారు జ్ఞాన బుద్ద పూర్ణిమా జాతీయ అవార్డు గ్రహీతగా ఎంపిక చేసికరీంనగర్ జరిగిన పీవీ నరసింహారావు జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన కు అవార్డును ప్రధాన చేశారు



