కోరుట్ల
మహదేవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జువ్వాడి కృష్ణారావు
viswatelangana.com
August 9th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు కోరుట్ల పట్టణంలోని పురాతన మహదేవ స్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జువ్వాడి కృష్ణారావు పత్రిక విలేకరులతో మాట్లాడుతూ. నియోజకవర్గ ప్రజలు పాడిపంటలతో, సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావుతో పాటు పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు ఎంబేరి నాగభూశణం, శీలం విజయలక్ష్మి, కోరుట్ల మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొంతం రాజం, నియోజకవర్గం యువజన కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, పట్టణ మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి మచ్చ కవిత, నాయకులు ఆడెపు మధు, అంజిరెడ్డి, అజయ్, విజయ్, కృష్ణ ప్రసాద్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



