కోరుట్ల

డాక్టర్ పేట భాస్కర్ ను సన్మానించిన కోరుట్ల మాదిగ సంఘం అధ్యక్షులు శనిగారపు రాజేష్

viswatelangana.com

August 15th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

78 వ భారత స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఈ మద్యనే డాక్టరేట్ అవార్డు, జాతీయ సేవారత్న అవార్డు పొందిన తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ మరియు నీటిపారుదల శాఖ ఏఈఈ గా నియమితమైన బొమ్మేన శ్రీమాన్, ఐటి సాప్ట్వేర్ గోవింద్, కానిస్టేబుల్ చిట్యాల సాయి కుమార్, మున్సిపల్, న్యాయవాద వృత్తుల్లోని మాదిగలతో పాటు ప్రజాప్రతినిధులను, కోరుట్ల అంబేద్కర్ మాదిగ యువజన సంఘం అధ్యక్షులు శనిగారపు రాజేష్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేసారు. గురువారం మాదిగ యువజన సంఘం జెండా పండగలో, వివిధ రంగాల్లో శ్రేష్టులైన మాదిగలను గుర్తించి కుల సంఘం కమిటీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నట్లు అసువులు బాసిన ఆమరుల త్యాగాలను స్మరిస్తూ వివిధ రంగాల్లో ఎదిగిన మాదిగలు జాతి గౌరవాన్ని దశదిశలా విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీ నారాయణ, సంఘ అధ్యక్షులు శనిగారపు రాజేష్, ఉపాద్యక్షులు ఎస్. మహేష్, ప్రధాన కార్యదర్శి మోర్తాడ్ రాజశేఖర్, కోశాధికారి చిట్యాల ప్రభాకర్, నాయకులు చిట్యాల భూమయ్య, లక్ష్మణ్, లచ్చయ్య, శ్రీనివాస్, శివ, ప్రేమ్ కుమార్, మారంపల్లి నర్సయ్య, బొమ్మేన రమేష్, బోల్లే జానీ, రాజయ్య, బలవంతుల నర్సయ్య, బెక్కెం అశోక్, రాంబాబు, రాందాస్, దినేష్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button