కోరుట్ల
అల్లకట్టు సత్యనారాయణకి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ (జీవిత సాఫల్య పురస్కారం )

viswatelangana.com
August 16th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ రెవిన్యూ డివిజన్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ టీ.ఎస్ జిల్లా అధ్యక్షులు, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత హార్ట్ ఫుల్ నెస్ టీచర్ అవార్డు గ్రహీత, అంతర్జాతీయ హింది గౌరవ సమ్మాన్ గ్రహీత, కబీర్ సమ్మాన్ గ్రహీత, గురు రత్న సమ్మాన్ గ్రహీత, అంతర్జాతీయ యోగ గౌరవ సమ్మాన్ గ్రహీత, గ్రీన్ యొద్ద సమ్మాన్ గ్రహీత, అఖిల భారత కావ్య శిరోమణి గ్రహీత, అల్లకట్టు సత్యనారాయణ స్కూల్ అసిస్టెంట్ హింది టీచర్ కు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా శ్రీ సత్య ఇందిర ఫౌండేషన్ జైపూర్ వారు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు (జీవిత సాఫల్య పురస్కారం )ను జాతీయ భాష హింది ప్రచారం, వివిధ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేసారు. ఈ సందర్బంగా పలువురు ఉపాధ్యాయులు, బంధు -మిత్రులు అభినందనలు తెలియజేసారు



