సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి ఉత్సవాలు

viswatelangana.com
కోరుట్ల మండలంలోని యూసుఫ్ నగర్ గ్రామంలో బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి ఉత్సవాలను స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు గ్రామంలో గల సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి, కొబ్బరి కాయలు కొట్టి అనంతరం ప్రజలందరికీ స్వీట్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీటీసీ గుగ్గిళ్ళ ప్రియాంక మాట్లాడుతూ… బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. అదేవిధంగా పాపన్న ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రభుత్వం ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా పాపన్న చరిత్రను అన్ని పాఠ్యపుస్తకాలలో చేర్చాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ లు గుగ్గిళ్ళ తుకారం గౌడ్, సత్యనారాయణ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు పల్లి శేఖర్ గౌడ్, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీనివాస్, సంఘ సభ్యులు గుగ్గిల్ల శ్రీనివాస్ గౌడ్, పంజాల శ్రీను, బత్తిని అంజయ్య, శంకర్, బొంగు లింగం, వెంకటి, లక్ష్మణ్ అలాగే గౌడ సేన యూత్ సభ్యులు అన్వేష్, ప్రేమ్, హరీష్, కుల సంఘాలు, నాయకులు పాల్గొన్నారు.



