కోరుట్ల

బదిలీపై వెళ్తున్న ఎస్సైని సన్మానించిన జర్నలిస్టులు

viswatelangana.com

August 18th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

వృత్తిపట్ల బాధ్యత అంకితభావం ఉన్నతా ధికారుల పట్ల విధేయతగా కలిగి ఉన్నటువంటి ఉద్యోగులు ఏ ప్రదేశంలో విధులు నిర్వహించిన సంతృప్తికరమైన జీవితం గడుపుతారని, కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముక్కెర చంద్రశేఖర్ అన్నారు. ఈ. కిరణ్ కుమార్ కోరుట్ల టౌన్ -1 ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తించి విఆర్ కు బదిలీ అయిన సందర్భంగా జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఎస్సై కిరణ్ కుమార్ కు శాలువాతో సన్మానించి వీడ్కోలు పలికారు.. .ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ సర్వసాధారణమని తాము ఎక్కడ వీదులు నిర్వహించిన, అంకితభావంతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముక్కెర చంద్రశేఖర్ అన్నారు. కాలనుగుణంగా ఎన్నో మార్పులు సమాజంలో వస్తున్నయని సమయాన్ని సందర్భాన్ని బట్టి విధులు నిర్వర్తించాలని, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.. ఈ సందర్భంగా ఎస్పై కిరణ్ కుమార్ మాట్లాడుతూ… తన విధి నిర్వహణలో తనకు సహకరించినటువంటి జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది కి ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు షౌకత్, మొహమ్మద్ సాజీద్ అలీ, సలావుద్దిన్, మూసీ ఉద్దీన్, అనాస్, అబ్దుల్ ఖాదర్, ఫయాజ్, అద్నాన్, తదితరులు ఉన్నారు.

Related Articles

Back to top button