మోటార్ సైకిల్ పై గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన కోరుట్ల పోలీసులు

viswatelangana.com
కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామ శివారులోని ఎల్లమ్మ గుడి వద్ద గంజాయి అమ్ముతున్న _ వ్యక్తిని అరెస్టు చేసినట్లు కోరుట్ల సి ఐ – సురేష్ బాబు తెలిపారు. సోమవారం కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.సురేష్ బాబు ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఈసందర్భంగా సిఐ మాట్లాడుతూ.. రాయికల్ మండలం గ్రామానికి చెందిన పెనుకొండ గణేష్ (25) మేడిచర్ల బల్కాజిరిలో వుండి కాలేజీలో బిటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఇతనికి తల్లి ఇచ్చే డబ్బులు జల్సాలకు సరిపోక పోగా ఇంకా గణేష్ సంపాదించాలన్న దురాలోచనతో తక్కువ ధరకు నిషేధిత గంజాయిని కొనుగోలు చేసి దాని ద్వారా ఎక్కువ ధరలకు అమ్ముకుందామని ఆలోచనతో గత కొన్ని రోజులుగా తక్కువ గంజాయిని కొని దానిని కోరుట్ల పట్టణ పరిసర గ్రామాలలో యువతకు గంజాయి తాగే అలవాటు ఉన్నవారికి గంజాయిని అమ్ముకుంటూ లాభాలు గడిస్తున్నారు. ఆదివారం రాజేష్ వద్ద గల గంజాయిని కోరుట్ల పట్టణ చుట్టుపక్కల గ్రామాలలో యువతకు అమ్మడానికి తన మోటార్ సైకిల్ పై వస్తున్నాడన్న పక్క సమాచారంతో జిల్లా అశోక్ కుమార్ ఆదేశాల మేరకు డిఎస్పీ ఉమామహేశ్వరరావు, పర్యవేక్షణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో కోరుట్ల సబ్ ఇన్స్పెక్టర్ కే శ్వేత, సిబ్బంది సాగర్, పవన్ కుమార్, శ్రీనివాసులు కలిసి పైడిమడుగు గ్రామ శివారులో నిందితుడు గణేష్ తన మోటార్ సైకిల్ పై తరలిస్తుండగా పట్టుకొని అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 368 గ్రాముల గంజాయిని ఒక మోటార్ సైకిల్ ఒక సెల్ ఫోను స్వాధీనం చేసుకున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.సురేష్ బాబు తెలిపారు. కోరుట్ల పట్టణ పరిసర గ్రామ ప్రజలు, యువకులు ఎవరు కూడా చెడు వ్యసనాలకు మత్తు పదార్తలకు బానిస కాకుండా ఉండాలని, వాటికి అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవాలని ఎవరైనా గంజాయి త్రాగిన, అమ్మిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అదేవిధంగా గంజాయి గురించి ఎవరైనా సమాచారం తెలియజేస్తే వారి నమాచారం. గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గంజాయి నిందితుడిని పట్టుకున్న సబ్ ఇన్స్పెక్టర్ కే. శ్వేత, సిబ్బంది సాగర్, పవన్ కుమార్, శ్రీనివాస్ లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మెట్పల్లి డిఎస్పి ఉమామహేశ్వరరావు అభినందించారు.



