కోరుట్ల
మున్సిపల్ పరిధి దుకాణాలలో ఆకస్మిక తనిఖీ చేసినసానిటరీ ఇన్స్పెక్టర్

viswatelangana.com
August 20th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణ మున్సిపల్ పరిధిలో మంగళవారం రోజున మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణంలోని పలు దుకాణాలలో ఆకస్మిక తనిఖీ చేసి 75 మైక్రాన్ కన్నా తక్కువగా ఉన్న పాలిథిన్ కవర్లను స్వాధీన పరచుకొని, ఆదుకాణ యజమానికి 3వేల రూపాయలు జరిమానా విధించడం జరిగింది. అలాగే రోడ్డుపైన చెత్తను పరవేసినచో వెయ్యి రూపాయల జరిమానా ఉంటుందని తెలిపారు. అదేవిదంగా దుకాణ లైసెన్సులు లేని వారు లైసెన్స్ తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ బాలే అశోక్, జూనియర్ అసిస్టెంట్ ఆకు అంజయ్య, వార్డ్ ఆఫీసర్ ప్రసాద్ అలాగే శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.



