కోరుట్ల

దేవుని కృప ఉంటే అన్నీ ఉన్నట్లే…

ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

viswatelangana.com

August 21st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణంలోని అతిపురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ లక్ష్మీదేవి విక్షైన ఆంజనేయ నూతన ఉప ఆలయాల ద్వారపాలక రాజగోపుర శిఖర విమాన వెంకటేశ్వర విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా బుధవారం నిర్వహించిన రెండవ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జగిత్యాల నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ లు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి స్వామి వారి శేష వస్త్రాలు కప్పి ఆశీర్వదించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆ దేవుని కృప ఉంటే అన్ని పనులు విజయవంతం అవుతాయని తెలిపారు. స్వర్గీయ మాజీ మంత్రి రత్నాకర్ రావు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తాను వేములవాడ దేవస్థానం కమిటీ చైర్మన్ గా ఈ ఆలయ అభివృద్ధి కోసం నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేసి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. అనంతరం ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయకపోవడమే కాకుండా ఆలయాన్ని పట్టించుకున్న నాధుడే లేకుండా పోయారన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ల ప్రోత్బలంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఆలయ విషయాని తెలియజేయగా వెంటనే నిధులు మంజూరు చేయడమే జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఆలయాలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కావున భక్తుల సహకారం ఉంటే అన్ని జరుగుతాయని, కావున భక్తులు, దాతల సహకారంతో నేడు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు, భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో పాటు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆలయ ఈఓ ఎం విక్రమ్, మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్, కోరుట్ల పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ వై అనుప్ రావు, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, మహిళా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు మచ్చ కవిత, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఎలేటి మహిపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, వెంకటేశ్వర దేవాలయ మాజీ అధ్యక్షులు పుప్పాల ప్రభాకర్, జక్కుల ప్రసాద్, కౌన్సిలర్లు ఎంబేరి నాగభూషణం, తిరుమల వసంత గంగాధర్, శీలం జయలక్ష్మి, వేణుగోపాల్, పుప్పాల ఉమాదేవి, ప్రభాకర్, కోఆప్షన్ సభ్యురాలు రెంజర్ల కల్యాణి, నాయకులు అన్నం అనిల్, శీలం వేణుగోపాల్, కొత్త సురేష్, ఇందూరి సత్యం, మ్యాకల నర్సయ్య, వోలేపు రాజేష్, గడేల విజయ్, గడేల అశోక్, దండిక కిషోర్, శ్రీకాంత్, తెడ్డు విజయ్, ఆలయ ప్రధాన అర్చకులు బీర్నంది నర్సింహాచారి, శ్రీనివాసాచారి, వేద బ్రాహ్మణ భాగవతములు చక్రపాణి, మధుసూదనాచార్య చక్రపాణి నర్సింహా మూర్తి పలువురు అర్చకులు వివిధ హోదాల నాయకులు, పట్టణ ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button