రాయికల్
సిపిఎస్ రద్దు చేయాలని ఉపాధ్యాయుల నిరసన

viswatelangana.com
August 23rd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ ఉన్నత పాఠశాలలో సిపిఎస్ రద్దు చేయాలని శుక్రవారం మధ్యాహ్న భోజన విరామంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలియజేశారు. నష్టం కలిగించే సిపిఎస్ ను రద్దు చేసి, పాత పెన్షన్ పునరుద్దరించి, ఉపాధ్యాయ, ఉద్యోగులకు మేలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎస్ సంఘం జిల్లా ఉపాధ్యక్షలు రాపర్తి నర్సయ్య, పిఆర్టియు టిఎస్ జిల్లా కార్యదర్శి అంతడుపుల గంగారాజం, వేముల మధు, కలవకోట కార్తీక్, సిద్దె గంగారాజం, వెనుగంటి గిరిధర్, కొల్లూరి భీమయ్యలు పాల్గొన్నారు.



