గ్రామీణ ఆర్థిక పరిస్థితులపై విద్యార్థుల విశ్లేషణ

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల జగిత్యాల రెండవ సంవత్సరం విద్యార్థిని, విద్యార్థులు గ్రామీణ ఆర్థిక పరిస్థితులు విశ్లేషణపై కోర్సులో భాగంగా ప్రాంతీయ పరిశోధనా స్థానం దత్త గ్రామమైన అల్లీపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ప్రధాన పంటల గురించి, రైతుల వద్ద పంటల సాగు ఖర్చులు గురించి విద్యార్థులు సమాచారం సేకరించారు. అలాగే అల్లీపూర్ రైతు ఉత్పాదక సంస్థలో (ఎఫ్ ఇ ఒ) లో వయ్యారిభామ కలుపు మొక్కల వల్ల జరిగే నష్టాలు గురించి శాస్త్రవేత్తలు డాక్టర్ డిఏ రజనీ దేవి, డాక్టర్ రవి మృతిక శాస్త్రవేత్త వివరించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న వయ్యారిభామ కలుపు మొక్కలను విద్యార్థులు తొలగించారు. ఈ కార్యక్రమంలో దత్తత గ్రామ ఇన్చార్జ్ డిఏ రజనీదేవి, మృతిక శాస్త్రవేత్త డాక్టర్ రవి, అగ్రి హబ్ రూరల్ కోఆర్డినేటర్ టి.రంజిత్ కుమార్, ఎఫ్ఈఓ అధ్యక్షుడు అత్తినేని శంకర్, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.



