రాయికల్
ప్రగతిలో హై స్కూల్లో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలు

viswatelangana.com
August 24th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఈసందర్భంగా నర్సరీ నుండి 4వ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులు గోపికమ్మ, శ్రీకృష్ణుని వేషధారణలో ఆకట్టుకున్నారు. ఆరో తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థినిలు ప్రదర్శించిన కోలాటం ఆటలు, శ్రీకృష్ణుని పాటలపై చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. యశోద వెన్నచిలికే విధానం, చిన్నికృష్ణులు ఉట్టి కొట్టే విధానం ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రాంగణమంతా పండుగ వాతావరణంతో వెల్లివిరిసింది. దాదాపు 300 మంది విద్యార్థిని, విద్యార్థులు ప్రత్యేక వేషధారణలో పాఠశాలకు వచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్, కరస్పాండెంట్ జయ శ్రీ, అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



