
viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన బోయిని గంగారాం కుటుంబాన్ని కుల బహిష్కరణ చేయడమే కాకుండా తన కుటుంబ సభ్యులతో ఎవరు మాట్లాడిన వారికి వార్నింగ్ ఇస్తూ జరిమానా విధిస్తామని బెదిరిస్తున్నట్లు బాధితుడు బోయిన గంగారాం తెలిపారు. వివరాల్లోకెళ్తే జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన బోయిని గంగారాం తాత ముత్తాతల నుండి వస్తున్నా ఓ ల్యాండ్ విషయంలో బంధువైన మారంపల్లి శ్రీనివాస్ మేడిపల్లి మండలంలో టెక్నికల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా విధులను అడ్డంగా పెట్టుకుని బోయిని గంగారం తన సర్వే నెంబర్ 779/ఆ కావాలని రికార్డులో కొట్టేసి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తనకు దక్కించుకోవాలని రికార్డులో కొట్టేపిస్తూ అక్రమాలకు పాల్పడుతూ అధికారులను తప్పుదో పట్టిస్తూ గతంలో కూడా ఓ ల్యాండ్ విషయంలో కూడా అక్రమాలకు పాల్పడితే ఆ బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. నిజ నిర్ధారణను పరిశీలించిన కోర్టు ఆ ల్యాండ్ భాదితుడిదేనని విచారణలో తేలడంతో కోర్టు తీర్పునిచ్చింది. దీంతో జంకు తిన్న అధికారి మారంపల్లి శ్రీనివాస్ బాధితుడికి ల్యాండ్ ను అప్పగించి అక్కడి నుండి జారుకున్నాడు. ఇలా తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అమాయక ప్రజల భూమిని లాక్కొని అధికారులతో పాటు అధికార యంత్రాంగానికి చెడ్డ పేరు తెప్పిస్తున్నాడు. అయితే ఇలాంటి ఘటనలో ఉన్నత అధికారులు తనకు సపోర్ట్ ఇస్తున్నారని వినికిడి. ఇలా పేద అమాయక ప్రజలను బెదిరిస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తూన్నడని సమాచారం. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి వంశ పారంగా వస్తున్న భూములను కబ్జా చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకొని తమ భూములను తమకు ఇప్పించాలని వెడుకుంటున్నారు. గత కొన్నినెలలుగా ఆర్థికంగా మానసికంగా ఎంతో క్షోభను అనుభవిస్తున్నమని ఎలాంటి తప్పులు చేయకుండానే కుల పెద్దలు తమని కుల బహిష్కరణ చేయడం. తమతో ఎవరైనా మాట్లాడితే జరిమానా విధిస్తామని చెప్పడం. దారుణమని కన్నీటి పర్యంతం అయ్యారు.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పోలీసు యంత్రాంగం స్పందించి తమ భూమీనీ అక్రమించాలనీ చూస్తున్న వారిపై, కుల బహిష్కరణ చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తాము మానసిక వేదనకు గురైతున్నామని తమకు ఏ నష్టం జరిగినా కుల పెద్దలే బాధ్యత వహించాలని అన్నారు.



