
viswatelangana.com
ఎమ్మెల్సీగా ఇటీవల ఎన్నికైన ఆమీర్ ఆలీకి యునైటెడ్ ముస్లీం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు మొహమ్మద్. ముజాహిద్. ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ మాట్లాడుతూ, తెలంగాణలో ముస్లిం మైనార్టీ సమాజం ఆర్థికంగా, ఉద్యోగ అవకాశాలు లేక, వ్యాపారాల్లో స్తోమత లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఈ అంశాలను ఆమీర్ ఆలీ దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్సీ ఆమీర్ ఆలీ మాట్లాడుతూ, మైనార్టీ హక్కుల పరిరక్షణ కోసం తన ప్రయత్నాలను కొనసాగిస్తానని, సమాజం యొక్క అన్ని వర్గాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సన్మాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేర్ ఆలీ, సంఘ స్థాపకులు & స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి షబ్బీర్, పొలిటికల్ ప్రెసిడెంట్ హమీద్ మరియు వివిధ మైనారిటీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.



