కోరుట్ల
బఫర్ జోన్ లో ఉన్న పౌల్ట్రీ ఫారం పై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో కి వినతిపత్రం

viswatelangana.com
August 31st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలో విలీన గ్రామమైన యెకీన్ పూర్ 6వ వార్డ్ కు చెందిన గ్రామస్తులు… ఊరిలోని స్తంభాల చెరువులో (ఎఫ్టిఏల్) బాపర్ జోన్ లో పౌల్ట్రీ ఫార్మ్ నిర్మించారని, అలాగే ఆట్టి పౌల్ట్రీ ఫార్మ్ వ్యర్థలు చెరువులో కలుస్తున్నాయని, ఆలా చెరువులో కలవడం ద్వారా అందులోని నీరు కలుసితం అవుతుందని, తద్వారా చెరువును కాపాడాలని అట్టి పౌల్ట్రీ ఫార్మ్ పై చర్యలు తీసుకోవాలని, ఆర్డిఓ కి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మ్యాదరి లక్ష్మణ్, కాశిరెడ్డి వెంకటరెడ్డి, ఉరుమడ్ల వెంకటి, కళ్లెం శంకర్ రెడ్డి, సంపతి మల్లేశం, జాగిలం భాస్కర్, పొన్నం రమేష్ అలాగే తదితర గ్రామస్తులు ఉన్నారు.



