రాయికల్
తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ప్రగతి విద్యార్థులు

viswatelangana.com
August 31st, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ప్రగతి ఉన్నత పాఠశాల ఏడో తరగతి విద్యార్థిని, విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం తహసిల్దార్ మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూం, విద్యార్థులకు ధరణి పోర్టల్, పహాని గురించి, రిజిస్ట్రేషన్ విధానం గురించి అవగాహన కల్పించారు. ఆర్.ఐ పద్మయ్య విద్యార్థులకు కుల, ఆదాయ, జనన, మరణ, నివాస సర్టిఫికెట్ల గురించి, మ్యాప్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ గణేష్, ఆర్.ఐ లు పద్మయ్య, దేవదాస్, సర్వేయర్ నరేందర్, జూనియర్ అసిస్టెంట్ సంధ్య, పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్, అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



