కోరుట్ల
ప్రతి ఒక్కరూ సామజిక బాధ్యత కలిగి ఉండాలి

viswatelangana.com
September 1st, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
ప్రతి ఒక్కరూ సామజిక బాధ్యత కలిగి ఉండి సమాజ సేవా చేయాలని కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముక్కెర చంద్ర శేఖర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని మా ఐ కేర్ కంటి ఆసుపత్రి మొదటి వార్షికోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కంటి వైద్యుడు మహమ్మద్ ముబీన్ ఆధ్వర్యంలో 60 సంవత్సరాలు నిండిన వారికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి కళ్ల జోడులను ఉచితంగా పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల మల్లి కార్జున్, ముజఫర్, విజయ్ పాటిల్, హైమద్ తదితరులు పాల్గొన్నారు.



