
viswatelangana.com
వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా మెట్ పల్లి డిఎస్పి ఉమామహేశ్వరరావు ప్రజలను కోరారు. మంగళవారం కోరుట్ల పట్టణంలోని వరద ప్రభావిత పలు ప్రాంతాలను కోరుట్ల సీఐ సురేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ… పట్టణంలోని వాగు ప్రక్కనే ఉన్న నివాస గృహాల వారు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షాలు కురుస్తున్న సమయంలో వారు ఇండ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలన్నారు. రాత్రి వేళల్లో అధికంగా వరద వస్తే ప్రాణ నష్టం జరుగుతుందని, ముందుగానే అధికారులు ఈ నివాసాలలో ఉండే వారిని ఖాళీ చేయించాలని ఆదేశించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎలాంటి ప్రాణా నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు ఇబ్బందులు కలగకుండా వర్షాభావ పరిస్థితుల దృశ్య వరద తాకిడి ఉన్న నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు. ప్రాంతంలో ఆయన వెంట ఎస్సైలు శ్రీకాంత్, శ్వేత, శ్యామ్ రాజ్, బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు ఫహీం తదితరులు ఉన్నారు.



