సమస్యలు పరిష్కరించాలి

viswatelangana.com
రాష్ట్రంలోని విద్యారంగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోనగిరి దేవయ్య, బోయినిపెల్లి ప్రసాద్ రావు లు కోరారు. రాయికల్ మండలం లోని కిష్టం పేట అల్లీపూర్ కస్తూరిబా విద్యాలయం ఆలూరు రాయికల్ తదితర పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులచే తెలంగాణ ప్రాంత ఉపాద్యాయ సంఘం సభ్యత్వ నమోదును చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ… 317 జి.ఓ ఉపాధ్యాయులను వెంటనే తమ జిల్లాలకు పంపాలని, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు చేసి బీఈడీ, డిఎడ్ చేసిన సెకండరీ గ్రేడ్ వారితో కామన్ సీనియారిటీతో భర్తీ చేయాలని, ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలని, కేజీబీవీ పాఠశాలలో పనిచేసే వారికి పే స్కేల్ అమలు చేయాలని, సాధారణ సెలవుల సంఖ్య పెంచాలని కోరారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయు లకు వెంటనే బదిలీలు చేపట్టాలని, పెండిగ్ లో ఉన్న నాలుగు డీ ఏ లకు వెంటనే జి ఓ విడుదల చేయాలనీ ప్రభుత్వాన్ని కోరినారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చెరుకు మహేశ్వర శర్మ, యస్ గంగాధర్, కస్తూర్బా యస్ఓ శోభారాణి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



