రాయికల్

జిల్లా స్థాయికి ఎంపికైన విస్డం హై స్కూల్ విద్యార్థులు

viswatelangana.com

September 14th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో గత మూడు రోజులుగా నిర్వహింపబడిన మండల స్థాయి ఎస్ జి ఎఫ్ క్రీడా పోటీలలో విస్డం హైస్కూల్ కు చెందిన 15 మంది విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. అండర్ 17 బాలికల విభాగంలో పాలడుగు శ్రేష్ఠ ( వాలీబాల్ మరియు కబడ్డీ ), అండర్ 17 బాలుర విభాగంలో ఇల్లెందుల వరుణ్ (ఖోఖో ), నోసిన మనీశ్వర్ సాయి (డిస్కస్ త్రో), అండర్ 14 బాలికల విభాగంలో పెద్దిరెడ్డి నవ్యశ్రీ (కబడ్డీ), బోడ మిధున (ఖోఖో), మల్యాల మనస్విని (ఖోఖో), చందనగిరి మధు వర్షిణి (వాలీబాల్), అండర్ 14 బాలుర విభాగంలో కాసారపు మహీధర్ (వాలీబాల్), కొత్త అక్షిత్ (హైజంప్&వాలీబాల్), ఇద్దం ప్రద్యుమ్న (ఖోఖో), కండ్లపెల్లి శశాంక్ (ఖోఖో), వట్టిమల్ల వికాస్ (కబడ్డీ), కొత్త మణితేజ(లాంగ్ జంప్) లు జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను అందుకు సహకరించిన పిఈటి జగన్, రవిష్ రెడ్డిలను మండల విద్యాధికారి గంగాధర్ పాఠశాల కరస్పాండెంట్ ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి డైరెక్టర్ నివేదిత రెడ్డి లు అభినందించారు.

Related Articles

Back to top button