కోరుట్ల
వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ తిరుపతి
viswatelangana.com
September 15th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలో మంగళవారం రోజున జరుపుకునే వినాయక నిమజ్జనం కోసం ఏర్పాట్లను పరిశీలించిన కోరుట్ల మున్సిపల్ కమిషనర్ తిరుపతి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా పట్టణంలోని బతుకమ్మవాగు, కంచర కుంట, ఎకిన్ పూర్ వాగులో విద్యుత్ దీపాలు అలంకరించినట్లు వారు తెలిపారు. విగ్రహ నిర్వాహకులు తగినసమయంలో వారి వారి ఆలంకరించిన రథలను గ్రౌండ్ లో సూచించిన నెంబర్లపై ఉంచి అధికారులకు సహకరించి అలాగే సమయపాలన పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ అరుణ్ అలాగే సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ మరియు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.



