కోరుట్ల

రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్

viswatelangana.com

September 17th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం గంగాధర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి గల్ఫ్ లో ప్రమాదవశాత్తు లేదా ఆకస్మిక మృతి చెందిన ప్రతి కుటుంబానికి గల్ఫ్ భరోసాగా 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసామని గంగాధర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ తో పాటు మండల అధ్యక్షులు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరమాండ్ల సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీనారాయణ, నాయకులు బలిజ రాజారెడ్డి, మ్యకల నర్సయ్య, తోడేటి శంకర్, తెడ్డు విజయ్, గడ్డం మల్లేష్, భుమేష్, కిషోర్, అశోక్, గంగాధర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Back to top button