కోరుట్ల

మన ప్రెస్ క్లబ్ అధ్యక్షుని ఇంటికెళ్ళి కళ్యాణ లక్ష్మి చెక్కు అందించిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్

viswatelangana.com

September 20th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ శుక్రవారం కోరుట్ల మున్సిపల్ విలీన గ్రామమైన యేకిన్ పూర్ గ్రామంలో మన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉరుమడ్ల శ్రీనివాస్ ఇంటికెళ్లి కళ్యాణ లక్ష్మి చెక్కును అందజేసారు. అనంతరం మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉరుమడ్ల శ్రీనివాస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కెర చంద్రశేఖర్, బారాసా సీనియర్ నాయకులు దారిశెట్టి రాజేష్ కాశిరెడ్డి మోహన్ రెడ్డి, అరికంటి సాగర్, పుట్కపు నర్సారెడ్డి, రహీం పాషా, కల్లూరు మాజీ సర్పంచ్ వన తడుపు అంజయ్య, బొమ్మ రాజేశం, గెల్లె గంగాధర్, నత్తి రాజ్ కుమార్ అలాగే పాత్రికేయులు కాశిరెడ్డి వెంకట రెడ్డి, కత్తిరాజు శంకర్, కోడూరి ప్రేమ్, వనతడుపుల సంజీవ్, దయ మదన్, ఎన్నమనేని మదన్మోహన్, జాగిలం శంకర్, కొక్కుల మురళి తదితరులున్నారు.

Related Articles

Back to top button