విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికరమైన ఆహారం అందించాలి
పాఠశాలలో ఉన్న సమస్యలు జువ్వాడి ద్రుష్టికి తీసుకెళ్తాం -బలిజ రాజారెడ్డి, మోర్తాడ్ లక్ష్మీనారాయణ

viswatelangana.com
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నగర్ లో గల ప్రైమరీ స్కూల్ లో విద్యార్థిని విద్యార్థులకు ప్రతిరోజు ప్రభుత్వం మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టినందున ప్రతిరోజు ప్రైమరీ స్కూల్ అంబేద్కర్ నగర్ లో విద్యార్థిని విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం నడిపిస్తున్న సందర్భంలో సోమవారం బలిజ రాజారెడ్డి సీనియర్ పాత్రికేయులు, మోర్తాడ్ లక్ష్మీనారాయణ మూడవ వార్డు కౌన్సిలర్ భోజనానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఇట్టి సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రైమరీ స్కూల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు అందరూ పేద కుటుంబంలో నుండి వచ్చిన వారు ఉంటారు. రెక్క ఆడితే డొక్కాడని తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి విద్యార్థిని విద్యార్థులు అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ భోజన విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నాణ్యమైన వస్తువులతో పౌష్టికరమైన ఆహారంను అందించాలని అలాగే విద్యార్థిని విద్యార్థులందరికీ సరైన సమయంలో మంచి విద్యను అందిస్తూ వారికి క్రీడారంగంలో మంచి ప్రోత్సాహాన్ని అందించాలని తెలిపారు. అలాగే పాఠశాలలో ఉన్న సమస్యలు జువ్వాడి నర్సింగ్ రావు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గండ్ర మధుసూదన్ రావు, పాఠశాల టీచర్లు మరియు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు పాల్గొన్నారు



