
viswatelangana.com
September 23rd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
పురపాలక సంఘం రాయికల్ ఆదేశానుసారం… కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా, సోమవారం రోజు ప్రగతి పాఠశాలలో ఆరో తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులచే స్వచ్ఛత ప్రతిజ్ఞను చేయించి,ఎస్ హెచ్ ఎస్ 24 ఆకృతిలో విద్యార్థులను కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్ మాట్లాడుతూ… పరిసరాల పరిశుభ్రత కు ప్రతి ఒక్కరం కృషి చేద్దామని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి శుభ్రతతో పాటు, పరిసరాలను, చదువుకునే పిల్లలు వారి తరగతి గదిని, పాఠశాల ప్రాంగణాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ బాలె జయశ్రీ,డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



