కోరుట్ల

సంఘ భావనానికి స్థలాన్ని కేటాయించాలని

జువ్వాడి ని కలిసిన సంఘ సభ్యులు

viswatelangana.com

September 24th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల మండల ముదిరాజ్ సమైక్య సంఘం సభ్యులు పట్టణంలోని ఎఎంసి కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు ను మర్యాద పూర్వకంగా కలిసారు. గత ప్రభుత్వలో సంఘ భావనానికి 15 గుంటల స్థలం అలాగే 5 లక్షల ఏమ్మెల్యే సీడీపీ నిధులు పొందమని, దీనికి సంబంధించిన 15 గుంటల స్థలాన్ని కేటాయించేలా సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని, ముదిరాజ్ సమైక్య సంఘం సభ్యులు జువ్వాడి నర్సింగ్ రావు కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు ఉరుమడ్ల శ్రీనివాస్, ఉరుమడ్ల వెంకటి, చొప్పరి శంకర్, జాగిలం శంకర్, జాగిలం లక్ష్మి నరసయ్యలు ఉన్నారు.

Related Articles

Back to top button